తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి టికెట్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ సంఘటనపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిందని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో.. వేరే విచారణ అవసరం లేదని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ జరపాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. ఇక ఇదే అంశంపై ఈ రోజు మరో పిల్ దాఖలు చేసింది. దీనిని సైతం హైకోర్టు కొట్టివేసింది. టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలంటూ.. కర్నూలు‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి ఏపీ హైకోర్టులో గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

Advertisements
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు


కేసు పూర్తి వివరాలు
ఇంతకీ ఏం జరిగిందంటే.. 2025, జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి. ఈ నేపథ్యంలో తిరుమలలో 10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఆ క్రమంలో జనవరి 9వ తేదీ తెల్లవారుజాము నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. అందుకోసం తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో 94 టోకెన్‌ జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పిల్లాపాపలతో సహా భారీగా తిరుపతికి వచ్చి చేరుకున్నారు.

ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం

అయితే బైరాగి పట్టెడ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో సిబ్బంది ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించేందుకు క్యూ లైన్‌ గేట్‌ను తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్లు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Related Posts
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మరో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టింది. గతంలో సికింద్రాబాద్ నుంచి Read more

టీడీపీలోకి వైసీపీ నేత చేరిక.
టీడీపీలోకి వైసీపీ నేత చేరిక.

పులివెందులపై టీడీపీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీపై దృష్టి సారించింది. జగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. Read more

Srisailam : శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు
Srisailam శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు

Srisailam : శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసిన కేటుగాళ్లు శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయాన్ని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీశైలానికి Read more

జగన్ పాలనలో వెలువడిన చీకటి జీవోలుకాదు కూటమి ప్రభుత్వానివి: లోకేశ్‌
Nara Lokesh Sensational Comments ON YS Jagan

అమరావతి: ఇకనైనా జగన్‌ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. ''వరద బాధితులకు ఇస్తామన్న రూ.కోటిలో ఒక్క Read more

×