కుంభమేళా పొడిగింపుపై ప్రభుత్వం క్లారిటీ

కుంభమేళా పొడిగింపుపై ప్రభుత్వం క్లారిటీ

మహాకుంభమేళా కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు. ఇప్పటికే 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళా లో పుణ్య స్నానాలకు ఇక ఒక ముహూర్తమే మిగిలి ఉంది. దీంతో, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్ రాజ్ కు భక్తుల తాకిడి పెరిగింది.

కుంభమేళా రికార్డు
కుంభమేళాకు భక్త జన వరద కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకూ 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్‌ ప్రకటించింది. ప్రపంచం లోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. జన వరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ కొనసాగనుంది. దా దాపు 45 రోజులపాటూ జరిగిన ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద సంగమంగా నిలిచింది.

కుంభమేళా రికార్డు


26వ తేదీన మహాశివరాత్రి రోజునే చివరి రోజు
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. అయితే, ప్రభుత్వం మాత్రం పొడిగింపు ఆలోచన లేదని తేల్చి చెబుతోంది. ముందుగా నిర్ణయించి న ప్రకారమే ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని అధికారులు స్పష్టం చేసారు. ఇక.. ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు పలువురు ప్రముఖులు ప్రయాగ్ రాజ్ చేరుకు న్నారు. పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేలా ముగింపు సమయం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

Related Posts
పరీక్షలలో బురఖాపై నిషేధం విధించాలి: మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే
nitesh rane

10 మరియు 12వ తరగతి రాష్ట్ర బోర్డ్ పరీక్షల సమయంలో బురఖా ధరించడాన్ని నిషేధించాలని మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే విద్యాశాఖ మంత్రిని కోరారు. పూర్తి శరీరాన్ని Read more

గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా భారత్‌ – మోదీ లక్ష్యం
గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా భారత్‌ మోదీ లక్ష్యం

భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేవ్స్ (WAVES) అడ్వైజరీ బోర్డ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో Read more

బీహార్‌లో పూలకుండీలు మాయం
బీహార్‌లో పూలకుండిలు మాయం

బక్సర్ జిల్లాలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ‘ప్రగతి యాత్ర’లో భాగంగాకు శనివారం బక్సర్‌లో అనేక ప్రాంతాలను సందర్శించారు. ఇందుకోసం ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు సర్క్యూట్ హౌస్ వెలుపల Read more

మరణం నుంచి తృటిలో తప్పించుకున్నాను: షేక్‌ హసీనా
sheikh hasina

కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో, మేము మరణం నుండి తప్పించుకున్నాము అని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. అధికారం నుంచి తప్పుకున్న తర్వాత తనపై, Read more