ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు

ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు

కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఫైబర్ నెట్ కు పైసా ఆదాయం రాలేదని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థలో ఉన్నతాధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ గంధంచెట్టు సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజలకు ఉద్వాసన పలికినట్లు తెలిపారు.
తొలగించిన ఉద్యోగులకూ జీతాలు
గత ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి తొలగించిన ఉద్యోగులకూ జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఫైబర్ నెట్ లో సంస్కరణలు ప్రతిపాదిస్తూ 400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఆదేశాలపై ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదన్నారు. ఇటీవల జీఎస్టీ అధికారులు ఫైబర్ నెట్ కు రూ.377 కోట్లు జరిమానా విధించిన విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని చెప్పారు.

Advertisements
ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు


చెల్లించిన జీతాల సొమ్మును వసూలు చేయాలి
ఈ తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని, సంస్థకు రూపాయి ఆదాయం రాలేదని తెలిపారు. ఎండీ దినేశ్ కుమార్ ఒక్క ఆపరేటర్ ను కూడా కలవడం లేదని, కనీసం సిబ్బందికి టార్గెట్లు కూడా పెట్టడంలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేయడానికి గత ప్రభుత్వ పెద్దలతో కలిసి దినేశ్ కుమార్ కుట్ర పన్నినట్లు జీవీ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. తొలగించిన ఉద్యోగులకు చెల్లించిన జీతాల సొమ్మును దినేశ్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారుల నుంచి వసూలు చేయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts
Trump Tariffs: ట్రంప్ బాదుడుపై కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు
ChandrababuNaidu: జనాభా పెరగడం అవసరమన్నచంద్రబాబు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ విధానాలు ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ విధానం, ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగానికీ Read more

కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్‌తో చంద్ర‌బాబు భేటీ
CM Chandrababu meets Union Minister Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తొ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో Read more

పాతపట్నంలో ఆవుపై దాడి చేసిన పెద్దపులి
tiger attacked a cow

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాతపట్నం మండలంలోని తీమర గ్రామ సమీపంలో ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఆవును Read more

కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్
కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి, కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, దక్షిణ భారతంలోని Read more

×