మరియా ఖాన్(Maria Khan)కు సంబంధించినంత వరకు భారత్ పాక్ (Bharath,Pakistan) మధ్య గత వారాంతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం చాలా ఆలస్యమైనట్లు లెక్క. మరియా కశ్మీర్ (Kashimr)లో ఉంటారు. మే 7న పాకిస్తాన్ (Pakistan)దాడుల్లో ఆమె తనకు కొడుకు, కూతురు వరసయ్యే 12 ఏళ్ల జైన్ అలీ (Jain Ali), ఉర్వా ఫాతిమా (urwa Fathima)లను కోల్పోయారు. పిల్లల తల్లిదండ్రులు యురుసా, రమీజ్ ఖాన్ (Urusha, RameejKhan)లు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పహల్గాం (Pahalgam) తీవ్రవాదుల దాడిలో 26 మంది పర్యటకులు చనిపోయిన తర్వాత మే 7 తెల్లవారు జామున పాకిస్తాన్, పాక్ ఆధీనంలోని కశ్మీర్ మీద భారత్ వరుస దాడులు చేసింది. ఇరువైపులా డ్రోన్ దాడులు, షెల్లింగ్ శనివారం వరకు కొనసాగింది.

‘బాంబు తాకిడికి పిల్లాడు ఎగిరిపడ్డాడు’
మే 7న పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్ వల్ల 16 మంది చనిపోయారని భారత్ ప్రకటించింది. పూర్తిగా చీకటి పడక ముందే, తమ ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖాన్ కుటుంబ సభ్యులకు కాల్పుల శబ్దం వినిపించింది.

ఉర్వా అక్కడికక్కడే చనిపోయింది
“నా చెల్లెలు ఉర్వా చేయి పెట్టుకుంది. నా మరిది అలీ చేయి పట్టుకున్నారు. వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రాగానే వారికి దగ్గర్లోనే షెల్ పేలింది. ఉర్వా అక్కడికక్కడే చనిపోయింది. పేలుడు ధాటికి జైన్ గాలిలోకి ఎగిరి ఎక్కడో పడిపోయాడు” అని మరియా చెప్పారు.
Read Also: Operation Sindoor: పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి శాటిలైట్ ఫోటోలు విడుదల