हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Shashi: కాంగ్రెస్ అధిష్టానంతో అభిప్రాయ భేదాలున్నాయన్న థరూర్

Vanipushpa

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో తనకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవలే అమెరికా, బ్రెజిల్(America, Brazil) తదితర ఐదు దేశాల్లో ‘ఆపరేషన్ సిందూర్'(Operatopm Sindoor) దౌత్య కార్యక్రమంలో భాగంగా అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి కేరళ రాజధానికి తిరిగివచ్చిన థరూర్, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. “మీ మనసులో ఏ ప్రశ్నలున్నాయో నాకు తెలుసు, కానీ నేను వాటికిప్పుడు సమాధానం చెప్పదలచుకోలేదు. ఇటీవల మా సీనియర్ నాయకులు తెన్నల బాలకృష్ణ పిళ్ళై కన్నుమూశారు, నేను అక్కడికి వెళుతున్నాను” అని థరూర్ తొలుత అన్నారు. అనంతరం, “అవును, కాంగ్రెస్ నాయకత్వంతో నాకు అభిప్రాయ భేదాలున్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. కొన్ని విషయాలు బహిరంగంగానే ఉన్నాయి. నేను వారిని (నాయకత్వాన్ని) నేరుగా కలుస్తాను, వారు నన్ను నేరుగా అడిగితే సమాధానం కూడా చెబుతాను. నేనెక్కడికీ వెళ్లడం లేదు… నేను కాంగ్రెస్ వాదిని” అని ఆయన తేల్చిచెప్పారు.

గురువారం జరుగుతున్న కీలకమైన నిలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి ఎందుకు హాజరుకాలేదని అడిగిన ప్రశ్నకు, “నన్ను దానికి ఆహ్వానించలేదు” అని థరూర్ క్లుప్తంగా బదులిచ్చారు.

కాంగ్రెస్ నాయకుడికీ ఆహ్వానం పంపరు

అయితే, థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో లోక్‌సభ సభ్యుడు రాజ్‌మోహన్ ఉన్నితన్ తీవ్రంగా స్పందించారు. “నిలంబూర్‌లో జరుగుతున్నది ఎవరి పెళ్లి కాదు ఆహ్వానించడానికి!” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. “కాంగ్రెస్ పార్టీలో నాయకులే ప్రచార కమిటీకి తమ లభ్యత గురించి తెలియజేస్తారు. ఏ నాయకుడు ఎక్కడ ప్రచారం చేయాలో కమిటీ నిర్ణయిస్తుంది. ఏ కాంగ్రెస్ నాయకుడికీ ఆహ్వానం పంపరు” అని ఉన్నితన్ తెలిపారు. గతంలో థరూర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం, ప్రధాని నరేంద్ర మోదీని, ముఖ్యంగా సరిహద్దు తీవ్రవాదంపై ఆయన ప్రభుత్వ స్పందనను ప్రశంసించడం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.

Read Also: Shashi Tharoor: ఆసీమ్ మునీర్‌కు ట్రంప్ విందు.. మండిపడ్డ శశిథరూర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870