हिन्दी | Epaper

TG POLYCET Results: తెలంగాణ పాలిసెట్ రిజల్ట్స్ విడుదల

Sharanya
TG POLYCET Results: తెలంగాణ పాలిసెట్ రిజల్ట్స్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి కీలకమైన పాలిసెట్ (TG POLYCET) పరీక్ష 2025 ఫలితాలు మే 24, శనివారం ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి (SBTET) ఈ ఫలితాలను హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లో ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ ప్రకటనను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన గారు స్వయంగా చేశారు.

పరీక్ష వివరాలు:

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 13న పాలిసెట్‌(TG Polycet) పరీక్షను నిర్వహించారు. మూల్యాంకనం అనంతరం 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో సాంకేతిక విద్య కమిషనర్ దేవ సేన పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. పాలిసెట్‌-2025కు 92.64 శాతం మంది హాజరయ్యారు. విషయం తెలిసిందే. దీనికి మొత్తంగా 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాశారు.

ప్రవేశ ప్రక్రియ

ఫలితాలు విడుదలైన తర్వాత, తక్కువలోపు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ ర్యాంక్ ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్, సీట్ల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన వంటి దశలను అనుసరించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులకు ఇటీవల ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్‌ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నట్లు ఈసారి నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫలితాలలో టాప్ మార్కులు

తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాల్లో నలుగురికి టాప్ -1 ర్యాంక్ వచ్చింది. మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 81.88% శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాలిసెట్‌ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును డైరెక్ట్‌ వెబ్‌సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Read also: Metro : నేటి నుంచి అమల్లోకి సవరించిన మెట్రో ఛార్జీలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నీట్ ఎండీఎస్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, అర్హతల పూర్తి వివరాలు!

నీట్ ఎండీఎస్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, అర్హతల పూర్తి వివరాలు!

మరో రెండు రోజుల్లో గేట్ ఫలితాలు విడుదల!

మరో రెండు రోజుల్లో గేట్ ఫలితాలు విడుదల!

వారికీ ఉచిత స్కూటర్లు, స్కాలర్‌షిప్‌!

వారికీ ఉచిత స్కూటర్లు, స్కాలర్‌షిప్‌!

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలివే!

దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలివే!

యుద్ధం ఎఫెక్ట్.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ

యుద్ధం ఎఫెక్ట్.. ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

📢 For Advertisement Booking: 98481 12870