ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం “మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0” వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానించనున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శాసనసభలో వెల్లడించారు. ఈ ఏఐ ఆధారిత వర్షన్‌ను జూన్ 30 నాటికి అందుబాటులోకి తేవడం జరుగుతుంది.ఈ కొత్త వెర్షన్ ద్వారా వాయిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంటే వినియోగదారులు వాయిస్ కమాండ్ ద్వారా తమ అవసరమైన సేవలను పొందగలుగుతారు.
కొత్తగా అందించనున్న సేవలు
టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చిన కూటమి సర్కార్, పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే,వాటి ఫలితాలను కూడా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు. అలాగే ఏఐ ఆధారిత వాయిస్ సేవలతో,బస్ టికెట్ కావాలని నోటితో చెబితే టికెట్ బుక్ చేస్తుందని, నంబర్ చెబితే కరంటు బిల్లు కట్టేస్తుందని వెల్లడించారు. ఈ సేవలు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.
ప్రజలకు అందుబాటులోకి డిజిటల్ సేవలు
విద్యార్థులకు వాట్స్ యాప్ ద్వారా హాల్ టికెట్లు ఫలితాలు,బస్ టికెట్, కరెంట్ బిల్లు చెల్లింపులు వాయిస్ కమాండ్ ద్వారా,టీటీడీ సేవలను వాట్స్ యాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తేనున్న ప్రభుత్వం, శాశ్వత ధ్రువీకరణ పత్రాలకు చట్టసవరణ ప్రణాళిక.

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం
విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అర్హులైన ఎస్సీ విద్యార్థులు మార్చి 20 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తు ఈ-పాస్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అటవీ శాఖ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( ఏపీపీఎస్సీ) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది.మార్చి 21 నుండి 23 వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించే అవకాశం.మార్చి 16న నిర్వహించిన పరీక్షకు 7,620 మంది హాజరయ్యారు.ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నిమిత్తం ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.