ప్రస్తుతం సమాజంలో ఆత్మహత్యలు అత్యంత తీవ్రమైన సమస్యగా మారిపోయాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీసుకునే దుస్థితి నెలకొంది. ఎక్కడైనా సమస్యలు వస్తే వాటిని అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి కానీ, ఆత్మహత్యే పరిష్కారం అనే భావన పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.తాజాగా, తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. భర్త రక్త పరీక్షలు చేయించుకోవడం లేదన్న కోపంతో భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సామాజికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
జ్వరం
తేలుకుంట గ్రామానికి చెందిన మేకల పద్మ (48) మరియు ఆమె భర్త తిరుపతి, బతుకు దెరువు కోసం 13 ఏళ్ల క్రితం మలేషియాకు వెళ్లి, ఇటీవలే స్వగ్రామానికి తిరిగి వచ్చారు. తిరుపతి గత నెల రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అనేక ఆస్పత్రులలో వైద్యం చేయించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో, భార్య పద్మ మరింత కలత చెందింది.ఈ క్రమంలో భర్తను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, క్షయ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో మరికొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే తిరుపతి మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించాడు. భార్య ఎంత బ్రతిమలాడిన వినిపించుకోలేదు.భర్త వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదన్న మనస్తాపంతో పద్మ తీవ్ర ఆవేశానికి గురై భవిష్యత్తులో భర్తకుఆరోగ్యపరమైన సమస్యలు మరింత ఎక్కువవుతాయని భావించి మనోవేదనకు గురైంది. ఎవరితోనూ తన బాధను పంచుకోక, ఇంటికొచ్చి పురుగుల మందు తాగి, అనంతరం చీరతో ఉరేసుకుంది.

కేసు నమోదు
ఈ ఘటనతో భర్త తిరుపతి షాక్‌కు గురయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే పద్మ మృతి చెందింది.ఈ ఘటనపై భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు జూలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సనత్‌కుమార్ తెలిపారు.
సమాజంలో పెరుగుతున్న ఆత్మహత్యలు
సమాజంలో కొత్తవి కావు. చిన్న చిన్న కారణాలకే జీవితాలను ముగించుకోవడం గమనార్హంగా మారింది. భయాందోళనలు ఒత్తిడి – వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు అధిగమించలేని స్థాయికి చేరడం.ఆరోగ్య సమస్యలు – ఆరోగ్య సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోవడం, వైద్యం చేయించుకోవడానికి నిరాకరించడం.తక్కువ సహనశక్తి – చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా భావించడం.సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. చిన్న సమస్యలకే ఆత్మహత్యే పరిష్కారం అనే భ్రమను తొలగించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరికొకరు మానసికంగా బలమైన అండగా నిలవాలి. ప్రభుత్వాలు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, బాధితులకు మానసికంగా సహాయపడే విధంగా చర్యలు తీసుకోవాలి.