తెలంగాణ రాజకీయాల్లో మరోసారి AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఆయన చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “అధికారంలో ఎవరు ఉన్నా మాతో ఉండాల్సిందే. రెడ్డి అయినా రావు అయినా, మేము ఎవరికీ అనుచరులం కాదు. వారే మా వెనుక వస్తారు. వారితో ఎలా పని చేయించుకోవాలో మాకు తెలుసు” అని ఆయన ఒక ప్రజాసభలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఒవైసీ వ్యాఖ్యలను కొందరు రాజకీయ విశ్లేషకులు ఆత్మవిశ్వాసంగా భావిస్తుండగా, మరికొందరు వాటిని అహంకారంగా చూస్తున్నారు.
Latest News: Kashmir: పాక్ మద్దతుతో కొత్త కుట్రలు – కశ్మీర్‌లో తీవ్ర హెచ్చరిక!
అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో BRS (తదేపరి TRS) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు MIM ఆ పార్టీతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించింది. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్య అవగాహన స్పష్టంగా కనిపించింది. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మజ్లిస్ పార్టీ తన వైఖరిని మార్చుకుని, కొత్త ప్రభుత్వంతో సమన్వయం సాధించడానికి ప్రయత్నిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ క్రమంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌తో స్నేహపూర్వక సంబంధాలకు సంకేతంగా భావించబడుతున్నాయి.

ఇక హైదరాబాద్ నగర రాజకీయాల్లో AIMIM ప్రభావం గణనీయంగా ఉంది. Old CItyలోని అనేక నియోజకవర్గాలు మజ్లిస్ ఆధీనంలో ఉండటంతో, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా వారి సహకారం అవసరం అవుతుంది. ఈ నేపధ్యంలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన “వారే మా వెనుక వస్తారు” అనే వ్యాఖ్య కొంత వాస్తవత కలిగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ సమానంగా ఉండాలని, ఎవరినీ అధికారం పైకిందలుగా చూడకూడదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా, అక్బరుద్దీన్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/