తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రభుత్వ పథకాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ స్థానంలో వివేక్ వెంకటస్వామి
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జిగా ఇప్పటివరకు కొనసాగిన మంత్రి కొండా సురేఖ (konda surekha)ను ప్రభుత్వం పదవి నుంచి తప్పిస్తూ.. ఆమె స్థానంలో ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy)ని నియమించింది. ఈ మార్పు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కొండా సురేఖకు కొత్తగా మరే జిల్లా బాధ్యతలు అప్పగించకపోవడం అధికార పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదే సమయంలో, వివేక్‌కు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం ఆయనకు మరింత కీలక పాత్ర ఇచ్చినట్లుగా విశ్లేషిస్తున్నారు.
ఇతర ఇన్‌ఛార్జ్ మంత్రుల్లో మార్పులేమీ లేవు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌ఛార్జిగా కొనసాగుతుండగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హైదరాబాద్ ఇన్‌ఛార్జిగా కొనసాగుతారు. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జిగా జరిగిన ఈ మార్పు ప్రభుత్వ విధానాలపై జిల్లా స్థాయిలో మెరుగైన పర్యవేక్షణ, సమన్వయం, పథకాల వేగవంతమైన అమలుకు దోహదపడేలా ఉండే అవకాశముంది. పాలనలో పునఃసంఘటనల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
Read Also : Milan Airport : ఎయిర్‌పోర్టులో కిందపడి డొల్లుతూ మహిళ గోల