हिन्दी | Epaper

వికారాబాద్ ఘటన..కొనసాగుతున్న అరెస్టులు..!

sumalatha chinthakayala
వికారాబాద్ ఘటన..కొనసాగుతున్న అరెస్టులు..!

వికారాబాద్ : లగచర్ల కలెక్టర్‌, అధికారుల పై దాడి ఘటనలో ఇంకా అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని కొడంగల్ పోలీస్‌స్టేషన్‌ నుంచి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరందరినీ సాయంత్రం వరకు రిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరికొందరి కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా.. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (క్లస్టర్‌) ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా ఈనెల 11న ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, తాండూరు సబ్‌-కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయకుమార్‌, వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డిపై రైతులు, గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సీరియస్‌ తీసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. లగచర్ల దాడిలో పోలీసులు మొత్తం 47 మంది నిందితులను గుర్తించగా.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మరో 21 మందిని రిమాండ్‌ చేశారు.

దాడిలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌రాజ్‌, దేవదాస్‌, గోపాల్‌నాయక్‌, విజయ్‌, విఠల్‌ పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ మూడు గ్రామాల్లో నిశబ్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ దాడిలో సురేష్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సురేశ్‌ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, దాడికి ముందు.. ఆ తర్వాత కూడా అతడి ఫోన్‌ నుంచి కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో 42 సార్లు మాట్లాడినట్లు కాల్‌డేటా రికార్డ్‌ (సీడీఆర్‌) ద్వారా గుర్తించారు. సురేశ్‌ తనకు ఫోన్‌ చేసిన విషయం వాస్తవమేనని, భూసేకరణకు వచ్చిన అధికారులతో శాంతంగా మాట్లాడాలని సూచించినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పులు

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం!

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు?

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

📢 For Advertisement Booking: 98481 12870