ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపిన వైనం వివాహబంధాలు ఎంతో అమూల్యమైనవి. కుటుంబాలు నైతికంగా బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజానికి అవకాశం ఉంటుంది. తద్వారా దేశం బలమైన పునాదిపై నిర్మింపబడి, అభివృద్ధివైపుకు దూసుకెళుతుంది. ప్రపంచ దేశాలకు మన కుటుంబ వ్యవస్థ గొప్ప ఆదర్శం. ఇంతటి విలువైన మన కుటుంబ సంబంధాల అనుబంధాలు రానురాను ఆవిరైపోతున్నాయి. కొందరు తమ అక్రమ సంబంధాల కోసం కట్టుకున్నవారిని వదిలేస్తున్నారు. లేదా హతమారుస్తున్నారు. ఓ భార్య తన ప్రియుడికోసం భర్తనే కడతేర్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Read Also: John Wesley: ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

హెచ్చరించిన భర్తపై కక్ష పెంచుకున్న భార్య
వికారాబాద్ జిల్లా (Vikarabad crime) చోడా పూర్ మండల కేంద్రంలో కర్రె రత్నయ్య (32), కవితలు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రత్నయ్య పొలం పనులు చేస్తుండగా, భార్య కవిత ప్రైవేట్ కంపెనీలో కూలీ పనిచేస్తూ, అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే భర్త రత్నయ్య దీన్ని గమనించి, పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని, ఇలాంటి పనులు మానేయాలని భార్య కవితను హెచ్చరించాడు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవాలని ఆయన కోరాడు.
పథకం ప్రకారం హత్య
ఈవిధంగా భర్త తనను హెచ్చరించడం భార్య కవితకు నచ్చక, ఏవిధంగానైనా భర్త అడ్డును తొలగించుకోవాలని ఆలోచించింది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పి, రత్నయ్యను హతమార్చాలని చెప్పింది. దీంతో పొలం పనుల కోసం రత్నయ్య వెళ్తుండగా.. మార్గంలో ప్రియుడు దాసరి రామకృష్ణ వెనుక నుంచి ట్రాక్టర్ తో ఢీకొట్టి హతమార్చాడు. తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన వదిన ప్రవర్తనపై అనుమానం ఉందని రత్నయ్య తమ్ముడు దేవయ్య ఫిర్యాదు చేయగా.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తానే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు భార్య కవిత ఒప్పుకుంది. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: