హైదరాబాద్ నగరంలో మొత్తం నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, మహిళలు మరియు చిన్నారులపై నమోదవుతున్న కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2025 సంవత్సరానికి సంబంధించి హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేసిన వార్షిక నేర నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 2025లో మొత్తం నేరాలు 15 శాతం తగ్గినట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (V. C. Sajjanar) తెలిపారు. 2024లో 35,944 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 30,690కు తగ్గిందని ఆయన వివరించారు. ప్రోయాక్టివ్ పోలీసింగ్, మెరుగైన నిఘా వ్యవస్థలే ఇందుకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు.
Read also: CP Sajjanar: మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదు

VC Sajjanar
లైంగిక దాడుల కేసులు 449 నుంచి 568కి పెరగడం
అయితే మహిళలపై నేరాలు 6 శాతం పెరగడం, పోక్సో చట్టం కింద కేసులు 27 శాతం పెరగడం గమనార్హం. మహిళలపై 2024లో 2,482 కేసులు నమోదు కాగా, 2025లో 2,625 కేసులు నమోదయ్యాయి. భర్తలు, అత్తమామల వేధింపులకు సంబంధించిన కేసులు 31 శాతం పెరిగాయి. అదే సమయంలో అత్యాచార కేసులు 31 శాతం తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. చిన్నారులపై లైంగిక దాడుల కేసులు 449 నుంచి 568కి పెరగడం అత్యంత ఆందోళనకరమని పోలీసులు పేర్కొన్నారు.
మహిళలపై కేసులు పెరగడానికి అవగాహన పెరగడమే కారణమని కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. గతంలో ఫిర్యాదు చేయడానికి భయపడిన మహిళలు ఇప్పుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఆస్తి సంబంధిత నేరాలు 28 శాతం, శరీర సంబంధ నేరాలు 16 శాతం, హత్యలు 10 శాతం తగ్గాయి. 2026లో నేరాల నియంత్రణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, డేటా అనలిటిక్స్‌ను మరింత విస్తృతంగా ఉపయోగిస్తామని, షీ టీమ్‌లను బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: