हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Utham kumar: ఉత్తమ్ రెడ్డి: ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్

Saritha
Utham kumar: ఉత్తమ్ రెడ్డి: ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్

హైదరాబాద్ : ధాన్యం దిగుబడిలో తెలంగాణ(Telangana)యావత్ భారతదేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Utham kumar)అన్నారు. వానాకాలం సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుందన్నారు. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంతటి దిగుబడి ఎక్కడ నమోదు కాలేదని మంత్రి అన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల కేంద్ర కార్యాలయంలో మంత్రి మంగళ వారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నీటిపారుదల విస్తరణతో తెలంగా ణా రాష్ట్రం సాధించిన వృద్ధి ధాన్యం దిగుబడిలో ప్రస్పుటమవు తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67.57 లక్షల ఎకరాలలో సాగిన వరి సాగులో 40.75 లక్షల ఎకరాలలో సన్నాలు, 26.82 లక్షల ఎకరాలలో దొడ్డు వడ్ల సాగు చేశారన్నారు.

Read also: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయండి!

ఇందులో సన్నాలు 90.46 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 57.84 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం కలిపి 148.30 లక్షల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి అరుదైన రికార్డుగా మంత్రి(Utham kumar) అభివర్ణించారు. భారతదేశ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డుగా నమోదు అవుతుందన్నారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అరుదైన రికార్డు నెలకొల్పిన ఘనత తెలంగాణా రైతాంగానికి చెందుతుందన్నారు. అదే సమయంలో కొనుగోళ్లలోను రాష్ట్రం యావత్ భారతదేశానికి మార్గదర్శనంగా నిలుస్తోందన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. కనిష్ట మద్దతు ధర కింద కొనుగోలు మొత్తానికి రూ. 21,112 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇందులో నేరుగా రైతులకు చెల్లింపుల కింద రూ.19,112 కోట్లు ఖర్చు కానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ నిమిత్తం చెల్లించాల్సిన రూ.6,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్రంలో పండిస్తున్న సన్నాలకు అంతర్జాతీయ స్థాయిలో అధిక డిమాండ్ పలుకుతుందన్నారు.

ఇప్పటికే ఫిలిప్పిన్ దేశంతో అనేక దేశాలకు ఉత్పత్తి అవుతుందన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిన నేపద్యంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకుగాను గిడ్డంగుల కొరత ఉండడం పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలోని గిడ్డంగులు 22.61 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థం ఉండగా ఇప్పటికే 21.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువలతో అవి నిండి పోయాయన్నారు. కేవలం 0.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉంచేందుకు మాత్రమే ఖాళీ ఉందన్నారు.

అయితే ప్రస్తుతం 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను వినియోగించే రాష్ట్రాలకు రవాణా చేయక పోవడంతో ఎఫ్.సి.ఐ గిడ్డంగులలో అవి పేరుకపోయాయన్నారు. దీంతో వానాకాలం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు స్థలం కొరవడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బాయిల్డ్ రైస్ను వినియోగించే రాష్ట్రాలకు సత్వరమే తరలించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. 2019-20లో 72 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2025-26 నాటికి ఏకంగా 148.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి చేరిందంటే నీటిపారుదల శాఖా సాధించిన విజయానికి సంకేతమన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో అధికారులు ఎఫ్.సి.ఐతో సమన్వయం చేసుకుని ప్రణాళికలు రూపొందించు కోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870