హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై నిరంతరం నిఘా ఉంచాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Tummala Nageswara Rao) సూచించారు. యూరియా (Urea) ను వ్యవసాయానికి కాకుండా, ఇతర ఆవస రాల కోసం మళ్లించకుండా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

5.32 లక్షల టన్నుల యూరియా సరఫరా
హైదరాబాద్లోని సచివాలయంలో మాట్లాడుతూ అవసరాలకు మించి యూరియాను కొనుగోలు చేయడం మానుకోవాలని రైతులకు సూచించారు. రాష్ట్రానికి యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. కేంద్రం కేటాయించిన 9.80 లక్షల టన్నుల యూరియాలో ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల టన్నుల యూరియాను మాత్రమే సరఫరా వేసిందని, దీంతో 2.69 లక్షల టన్నుల లోటు ఏర్పండిందని చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (Ramagundam Fertilizer Factory) లో 78 రోజులు ఉత్పత్తి జరగకపోవటం వలన రాష్ట్రానికి సరఫరా కావాల్సిన యూరియాలో పెద్ద లోటు ఏర్పడిందని అన్నారు. అంతేకాకుండా దిగుమతి ద్వారా కావాల్సిన యూరియాలో, కొన్ని నెలలలో కొన్ని కంపెనీలు అసలు సరఫరాలే చేయలేడన్నారు.
ఇతర రాష్ట్రాలలో కూడా యూరియా కొరత
రాష్ట్రంలోనే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్, హర్యాన, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా యూరియా కొరత ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో సీజన్ ముందుస్తుతో మొక్కజొన్న లాంటి పంటలు అధికంగా సాగు వేయడం వల్ల ఈ సంవత్సరం గతం కంటే యూరియా అమ్మకాలు అధికంగా జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నల్గొండ, గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి జిరాల్లో గత సంవత్సరంతో పోలిస్తే అధికంగా అమ్మకాలు జరిగినట్టు తెలిపారు. ప్రతి నౌక నుండి ఆదనంగా 20 వేల టన్నుల యూరియాను కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాయాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి నండర్రావు, డైరక్టర్ గోపి గారు, హెచ్ఎసీఎ, మార్క్ ఫెడ్, ఆగ్రోస్ ఎంపీలు చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, రాము లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: