తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థులకు తీపి కబురు అందించింది.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్ పిఎస్సి ) గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌ను టిఎస్ పిఎస్సి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గత సంవత్సరం అక్టోబర్‌లో గ్రూప్-1 పరీక్షలను నిర్వహించిన టీజీపీఎస్సీ, ఈ సంవత్సరం మార్చి 10న తాత్కాలిక మార్కులను వెల్లడించింది. ఇప్పుడు తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ వివరాలు
ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉన్నారు. 550 నుంచి 503 వరకు మార్కులు సాధించిన అభ్యర్థులకు ఈ లిస్ట్‌లో ర్యాంకులు కేటాయించారు. హాల్ టికెట్ నంబర్,900 సాధించిన మార్కులు, కమ్యూనిటీ, మల్టీ జోన్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా వంటి వివరాలను ఈ లిస్ట్‌లో పొందుపరిచారు.
టాప్ ర్యాంక్
టాప్ టెన్‌లో ఆరుగురు మహిళలు ఉండగా, నలుగురు పురుష అభ్యర్థులు ఉన్నారు.240946218 హాల్ టికెట్ నంబర్‌కు టాప్ ర్యాంక్ లభించింది. మొత్తం 550 మార్కులొచ్చాయి. ఓపెన్ కేటగిరీకి చెందిన యువతి. మల్టీ జోన్ 2లో ఈ ర్యాంక్ వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ జనరల్ ర్యాంకుల లిస్ట్‌లో ఈ ఓపెన్ కేటగిరీకి మొత్తం 17 ర్యాంకులు లబించాయి. బీసీ- ఏ 2, బీసీ- బీ 14, బీసీ- సీ 0, బీసీ- డీ 6 ర్యాంకులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 10వ తేదీన టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 నియామక పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

ప్రాథమిక మార్కులు
563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన మెయిన్స్ పరీక్షను రాసిన అభ్యర్థుల ప్రాథమిక మార్కులను ఇదివరకే విడుదల అయ్యాయి.డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ- 2, వాణిజ్య పన్నులు, ప్రాంతీయ రవాణ, జిల్లా పంచాయతీ, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ప్రిసన్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్- 2 వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి.
సంక్షేమ శాఖ
జిల్లా సాంఘిక సంక్షేమం/ జిల్లా షెడ్యూల్డ్ కుల అభివృద్ధి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులతో పాటు జిల్లా గిరిజన సంక్షేమం, జిల్లా ఎంప్లాయ్‌మెంట్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్.. వంటి పోస్టులకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇది.