हिन्दी | Epaper

Kothagudem Municipal Corporation : కొలిక్కి వచ్చిన కొత్తగూడెం కార్పొరేషన్ అంశం

Sudheer
Kothagudem Municipal Corporation : కొలిక్కి వచ్చిన కొత్తగూడెం కార్పొరేషన్ అంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ ఎన్నికల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈనెల 11న జరిగిన పోలింగ్, 13న వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్లలో అధికార కాంగ్రెస్ 22, సీపీఐ 22 స్థానాలను గెలుచుకుని సమాన బలంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ రాష్ట్ర నేత పల్లా వెంకట్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, మేయర్ పీఠాన్ని సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించాలని నిర్ణయించారు.

Telangana: మంత్రులను అభినందించిన సీఎం

కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలు జిల్లా రాజకీయాల్లో వామపక్షాల పట్టును మరోసారి నిరూపించాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, సీపీఐలు చెరి సగం (22 చొప్పున) స్థానాలు సాధించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 8 స్థానాలకు పరిమితమైంది. ఇవి కాకుండా బీజేపీ 1, సీపీఎం 1 మరియు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మేయర్ పీఠం దక్కాలంటే కనీసం 31 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐలు కలిసి పోటీ చేయకపోయినా, అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో కార్పొరేషన్ పాలనలో ఎర్రజెండా, హస్తం జెండా కలిసి ప్రయాణించనున్నాయి.

ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎనిమిది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, దీనిపై ఆ ఎనిమిది మంది సభ్యులు స్పందిస్తూ తాము అమ్ముడుపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మేయర్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు వారంతా కలిసి ఒక వీడియో ప్రకటనను విడుదల చేస్తూ, తమ పార్టీ విధేయతను చాటుకున్నారు. మార్చి 16న జరగనున్న మేయర్ ఎన్నికతో ఈ ప్రక్రియ అధికారికంగా ముగియనుంది. ఈ ఒప్పందంతో కొత్తగూడెం అభివృద్ధికి ఇరు పార్టీలు సమన్వయంతో పనిచేస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు కన్నుమూత

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే రాములు కన్నుమూత

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

నిజామాబాద్‌లో బస్సు ప్రమాదం, నలుగురు మృతి

నిజామాబాద్‌లో బస్సు ప్రమాదం, నలుగురు మృతి

ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం

ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం

కోకాపేటలో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

కోకాపేటలో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం

నేటి నుండి తెలంగాణ లో వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం

నేటి నుండి తెలంగాణ లో వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం

లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

📢 For Advertisement Booking: 98481 12870