తెలంగాణలో (TG) మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో 11వ తేదీన జరగనున్న ఏడు నగర పాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల ఎన్నికల్లో (elections) మొత్తం 12,944 (ఏకగ్రీవాలతో కలిపి) మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పురపాలక ఎన్నికల్లో పురుష అభ్యర్థుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం పోటీదారుల్లో 6,508 మంది (50.27శాతం) మహిళా అభ్యర్థులు ఉన్నారు. పురుషు అభ్యర్థులు 6,436 (49.73 శాతం) మంది.
Read Also: AP: జగన్ తప్పులు చేసి మాపై ఆరోపణలు చేస్తున్నారు: చంద్రబాబు

నగరపాలక సంస్థల్లో ఒకటైన కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా వీటిలో అత్యథికంగా 398 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. (TG) ఇక పురపాలిక సంస్థల్లో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 49 వార్డులకు గాను 314 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అత్యల్పంగా కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 34 మంది మాత్రమే ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. అలాగే నగరపాలికలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 127 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పురపాలికల్లో ఆదిలాబాద్‌లో 93 మంది ఇండిపెండెంట్‌అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను లంగాణ ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: