हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

TG: హామీలు అమలు చేసేదాకా వెంట వెంటపడతాం..హరీశ్ రావు

Saritha
TG: హామీలు అమలు చేసేదాకా వెంట వెంటపడతాం..హరీశ్ రావు

మెదక్ జిల్లా(TG) పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలు ప్రశ్నిస్తున్నారని డైవర్షన్‌ టాక్టిక్స్‌ చేస్తున్నాడు. నిన్న నాకు నోటీసులు ఇచ్చిండు నేడు కేటీఆర్‌కు ఇచ్చిండన్నారు.

Read Also: HYD: రోహింగ్యాల చట్టబద్ధతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

కేటీఆర్‌ ఒకవైపు నుంచి నిలదీస్తుండు ఇంకోవైపు నుంచి నేను అడుగుతనే ఉన్నా. నీ బొగ్గు కుంభకోణంలో నీ బావమరిదికే నువ్వు సాయం చేసినవ్‌ నీ సంగతి ఏందంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండు. భయపడుతమనుకుంటున్నవా..? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

(TG)కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టకుండా, ప్రతిపక్ష నేతలను వేధించడమే ప్రభుత్వ పని అయిందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870