పర్యాటక శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు
TG Tourism Development: తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. మంగళవారం హిమాయత్నగర్ లోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కార్యాలయంలో సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, ఇతర ఉన్నతాధికా రులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి. మోలిక సదుపాయాల మెరుగుదల, పర్యాటక ఆస్తుల వినియోగం, ప్రాచూర్యం, ప్రచారం, ఆదాయ మార్గాలు, హరిత హోటళ్ల నిర్వహణ, పెండింగ్ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also: Velugumatla Demolition : వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

మెరుగుపరచాలని అధికారులకు సూచన
ప్రధాన పర్యాటక ప్రాంతాలలో సూచిక బోర్డులు, ఫుడ్ కోర్టులు, టూరిజం సమాచార కేంద్రాలు వంటి ప్రాథమిక సౌకర్యాల స్థితిగతులపై మంత్రి సమీక్షించారు. బోటింగ్ సౌకర్యాలు, కాటేజీలు, వ్యూ పాయింట్లు, హరితహోటళ్ల నిర్వహణను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, పర్యాటకుల సంఖ్య పెరిగేలా, వారికి మరింత సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ప్రపంచ పర్యాటక ముఖ చిత్రంలో తెలంగాణ కీలక స్థానంలో ఉండాలనే సీయం రేపంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధి, బ్రాండింగ్, ప్రమోషన్, ప్రచారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సంస్కృతి రక్షణ, కళాకారుల ప్రోత్సాహం
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి తెలంగాణను ఆకర్షణీయమైన టూరిజం గమ్యస్థానంగా తీర్చిద్దేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు. పర్యాటక ప్రచారంపై ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వాటికి ధీటుగా మన పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు సులభంగా చేరుకునేలా సూచిక బోర్డులను (డైరెక్షన్ సైనేజ్) ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో పాటు, కళాకారులను ప్రోత్సహించేందుకు పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. మన కళలు, మన భాష, మన సంస్కృతి మన అస్తిత్వానికి ప్రతీకలు, వాటిని పరరక్షించుకుంటూ భావితరాలకు అందించేందుకు కృషి చేయాలి. కళాకారులకు తగిన గుర్తింపు, ఆర్థిక చేయూత అందించే దిశగా చర్యలు ఉండాలి. ప్రసిద్ధ ప్రదేశాల్లో హంపి థియేటర్లు నిర్మించాలని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
సంస్థ బస్సులను నిరుపయోగంగా ఉంచరాదు
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు. నిర్వహిస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి. వివరించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆయా రూట్లలో నడుస్తున్న బస్సుల వివరాలను, ఆదాయంపై మంత్రి ఆరా తీశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడంతో గణనీయంగా ఆదాయం తగ్గిందని మంత్రికి అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చెప్పగా మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బస్సులను కొనుగోలు చేశామని, వాటిని నిరుపయోగంగా ఉంచడం వల్ల ఆదాయం కొల్పోవాల్సి వస్తుందని, స్పెషల్ ప్యాకేజీలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. పనులను మరింత వేగవంతం చేయాలని అన్నారు. నిరక్ష వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: