తెలంగాణ (TG) లోని, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట గ్రామంలో చోటుచేసుకున్న ఒక సంఘటన గ్రామస్తులనే కాదు, సోషల్ మీడియాలోనూ విస్తృత చర్చకు దారితీసింది. గ్రామానికి చెందిన పూజారి నాగిళ్ల వెంకటేశ్వర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన జీవనోపాధి కోసం గ్రామస్తులు కేటాయించిన 4.38 ఎకరాల భూమిని గురువారం గ్రామసభలో గ్రామ పంచాయితీకే రాసిచ్చేశారు.పూజారి నాగిళ్ల వెంకటేశ్వర్లుకి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన వెంకటేశ్వర్లు 50 ఏళ్ల క్రితం పెంచికల్ పేటలోని దేవాలయానికి పూజారిగా వచ్చారు.
Read Also: Adivasis : ఆదివాసులకు అనాదిగా అన్యాయమే?
పూర్తి వివరాలు
ఆ సమయంలో అతని జీవనోపాధి కోసం గ్రామ పెద్దలు 4.38 ఎకరాల భూమిని సాగుకోసం కేటాయించారు. దీంతో అప్పటినుంచి వెంకటేశ్వర్లు పౌరోహిత్యం చేసుకుంటూ.. ఆ భూమిలో పంటలు పండిస్తూ కుటంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారులు, కుమార్తెకు వివాహం జరిపించాడు.అయితే ఇటీవల వెంటకేశ్వర్లు భార్య మరణించింది. ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.దీంతో వెంకవేశ్వర్లు బాగోగులు చూసుకునే వారు కరువయ్యారు. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన తనను పోషించేవారులేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

ఈ క్రమంలోనే గ్రామ ఆలయంలో మరో పూజారిని నియమించారు. దీంతో వెంకటేశ్వర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కొడుకులు తనను పోషించడం లేదని భావించిన ఆయన గతంలో గ్రామస్తులు తనకు కేటాయించిన భూమిని తిరిగి గ్రామ పంచాయితీకే ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఈక్రమంలో గురువారం గ్రామసభ ఏర్పాటు చేసి, తన అసైన్డ్ భూమిని తిరిగి గ్రామపంచాయతీకే ఇస్తున్నట్లు కాగితాలపై సంతకం చేశాడు. వెంకటేశ్వర్లు నిర్ణయంతో అటు కొడుకులు, ఇటు గ్రామస్థులు అంతా ఆశ్చర్యపోయారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: