తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఆయన రేపటి సమావేశాలకు హాజరవుతారా? లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఇవాళ రాత్రిలోపు నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.
Read also: Drugs Case : డ్రగ్స్ కేసు ఆడియో, వీడియో సాక్ష్యాలన్నీ ఏమయ్యాయి?

TG
ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీలో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు కూడా అసెంబ్లీ వేదికపై ఆయన ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: