हिन्दी | Epaper

TG TET: తెలంగాణ టెట్‌ 2025 ఆన్సర్ కీ విడుదల

Sharanya
TG TET: తెలంగాణ టెట్‌ 2025 ఆన్సర్ కీ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత నిర్ధారించేందుకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) 2025 జూన్ సెషన్ పరీక్షలు ఇటీవలే విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో జూన్ 18 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో 16 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి.

ఈ నేపథ్యంలో, ప్రాథమిక ఆన్సర్‌ కీ (Answer Key) తాజాగా విడుదలైంది. ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టెట్‌ కన్వినర్ నవీన్‌ నికోలస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టెట్‌ (TET) పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హాజరు శాతం వివరాలు

పరీక్షల హాజరు శాతం విశ్లేషణ చూస్తే, అభ్యర్థుల్లో ఆసక్తి ఎంతో స్పష్టమవుతోంది.

పేపర్ – 1 (ప్రాథమిక స్థాయి):

పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 47,224 మంది అంటే 74.65 శాతం పరీక్షలకు హాజరయ్యారు.

పేపర్ – 2 (గణితం & సైన్స్):

అలాగే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్‌ (Maths and Science Paper) కు 66,686 మంది దరఖాస్తు చేసుకుంటే 48,998 మంది అంటే 73.48 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.

పేపర్ – 2 (సోషియల్ స్టడీస్):

పేపర్ 2 సోషల్ స్టడీస్ పేపర్‌కు 53,706 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 41,207 మంది అంటే 76.73 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది కీ రూపొందించి, ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో (https://tstet.cgg.gov.in) చెక్‌ చేసుకోవచ్చు.

ఆన్సర్ కీపై అభ్యంతరాల గడువు

ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలను జులై 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ పంపించడానికి అవకాశం ఉంటుందని టెట్‌ కన్వినర్ నవీన్‌ నికోలస్‌ సూచించారు. ఫైనల్ కీ ఆధారంగా ఫలితాల ప్రక్రియ పూర్తిచేయబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: KTR: రాష్ట్రంలో ఎరువుల కొరతపై కేటీఆర్ విమర్శలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

📢 For Advertisement Booking: 98481 12870