TG: తమ ప్రభుత్వ విజన్ వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్గా చూస్తున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. బుధవారం సిసిఐ తెలంగాణ, నేషనల్ టర్మిరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యు చైన్ సమ్మిట్-2025(Turmeric Value Chain Summit-2025) లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పసుపు పంటను ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమన్నారు. ప్రభుత్వ ఆగ్రి విజన్ లో పసుపుకి కూడా పాత్ర ఉందని చెప్పారు.
Read also: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగింపు


నేషనల్ టర్మరిక్ బోర్డు రైతులకు దిశ చూపాలి
మెడిసిన్, న్యూట్రాస్యూటికల్స్(Nutraceuticals), ఫంక్షనల్ ఫుడ్స్ వంటి రంగాల్లో పసుపు వినియోగం పెరుగు తోందని వెల్లడించారు. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని తెలిపారు. పసుపును అధికంగా పండించే రాష్ట్రాలలో తెలంగాణ(TG) కూడా ఒకటని, ఆర్మూర్ పసుపుకు జిఐ ట్యాగ్ రావడం రైతులకు గర్వకారణమన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, అది పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ బోర్డు కార్యాలయ పరిమితుల్లో కాకుండా, రైతులకు పాలసీ దిశ చూపే సంస్థగా పనిచేయాలన్నారు.

పరిశోధనను పొలాలకు తీసుకెళ్లాలన్నారు. మార్కెటింగ్, బ్రాండింగ్, ఎగుమతుల్లో నాయకత్వం వహించాలని సూచించారు. తెలంగాణలో అనుకూల వాతావరణం, శ్రమించే రైతులు ఉన్నప్పటికీ ధరల హెచ్చు, తగ్గుల కారణంగా పసుపు సాగు విస్తీర్ణం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక క్వింటా పసుపు ఉత్పత్తికి రూ.9 వేల వరకు ఖర్చు అవుతుండగా, మార్కెట్లో రూ.12 వేలు మాత్రమే ఉండటం రైతులను నిరుత్సాహపరు స్తోందన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు విజన్ 2047కు అనుగుణంగా పనిచేసి, ధరల స్థిరత్వం, ముందస్తు మార్కెట్ సంకేతాలు అందించాలన్నారు.
ప్రామాణిక మాయిశ్చర్ మీటర్లు, ఒకే రకమైన తేమ ప్రమాణాలు, పారదర్శక మార్కెట్ వ్యవస్థ అమలు చేయాల్సి ఉందని చెప్పారు. అధిక కర్క్యూమిన్ రకాలతో పాటు, నాణ్యమైన టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి, ప్రపంచ ప్రమాణాలకు తగ్గ పసుపు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టర్మరిక్ బోర్డు చైర్మన్ గంగారెడ్డి, సెక్రటరీ భవానీ, వ్యవసాయ సెక్రటరీ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: