తెలంగాణ (Telangana) ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఓపెన్ పదోతరగతి (SSC), ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి–ఏప్రిల్ 2026లో నిర్వహించనున్న రాత పరీక్షలకు ముందుగా విద్యార్థులు నిర్ణయించిన తేదీల్లో పరీక్ష రుసుములు చెల్లించాల్సి ఉంది.
Read also: TG: తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..

10th class and intermediate exams
ఫీజు చెల్లింపు కీలక తేదీలు
- ఆలస్య రుసుము లేకుండా
డిసెంబర్ 11, 2025 నుంచి డిసెంబర్ 26, 2025 వరకు. - ప్రతి పేపర్‌కు రూ. 25 ఆలస్య రుసుముతో
డిసెంబర్ 27, 2025 నుంచి జనవరి 2, 2026 వరకు. - ప్రతి పేపర్‌కు రూ. 50 ఆలస్య రుసుముతో
జనవరి 3, 2026 నుంచి జనవరి 7, 2026 వరకు. - తత్కాల్ విధానం (సాధారణ రుసుము + రూ.1000 జరిమానా)
జనవరి 8 నుంచి జనవరి 12, 2026 వరకు.
TOSS ప్రకారం, ఫీజులు సమయానికి చెల్లిస్తే హాల్‌టికెట్ల నుండి పరీక్ష సెంటర్ల వరకు అన్ని ప్రక్రియలు సాఫీగా సాగుతాయని సూచించింది. ఓపెన్ విద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఈ షెడ్యూల్ కీలకం.
రాత పరీక్షలు ఎప్పుడు?
అధికారిక తేదీలను త్వరలో ప్రకటించనుండగా, ప్రాథమికంగా మార్చి – ఏప్రిల్ 2026 మధ్య ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయని TOSS పేర్కొంది.
రెగ్యులర్ పదో తరగతి (SSC) పరీక్షలు
పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ప్రతిపాదన ప్రకారం, రెగ్యులర్ SSC పరీక్షలు మార్చి 18, 2026 నుంచి ప్రారంభం కావచ్చు. ఈసారి ప్రతి సబ్జెక్ట్‌కు ఒకటి రెండు రోజుల విరామం ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేస్తుండటం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: