(TG) ఐదుగురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) కీలక తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను స్పీకర్ గడ్డం ప్రసాద్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవన్నారు. బీఆర్ఎస్ వాదనతో ఏకీభవించనని తేల్చిచెప్పారు.
Read Also: TG Crime: భువనగిరి జిల్లాలో యువకుడి దారుణ హత్య

స్పీకర్ తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించారు
ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: