తెలంగాణ లో (TG) ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. తొలుత ఈ నెల 20వ తేదీన నూతన సర్పంచులు తమ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ రోజున ముహూర్తం అనుకూలంగా లేదని పలు గ్రామాల నుంచి కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రభుత్వాన్ని కోరడంతో, ప్రమాణ స్వీకార తేదీలో మార్పు జరిగింది.
Read Also: Telangana: GHMC విలీనంతో లాభమా?
ఈ నెల 22వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరణ
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ (TG) బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఈ నెల 22వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామాలలో, సంప్రదాయాలు, ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే విషయం తెలిసిందే.

ముఖ్యంగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో మంచి ముహూర్తం చూసుకోవడం గ్రామ రాజకీయాల్లో సాధారణంగా కొనసాగుతున్న ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పలువురు కొత్త సర్పంచులు తమ అభ్యర్థనను అధికారులకు తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: