తెలంగాణ (TG) పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సమరం నేటి నుంచి మొదలవుతోంది. తొలి దశలో భాగంగా 189 మండలాల పరిధిలోని 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రోజు కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయడంతో నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది.
Read Also: South Central Railway: ఇక ఇంటి వద్దకే రైల్వే పార్సిల్ డెలివరీ
పూర్తీ వివరాలు
నామినేషన్ల స్వీకరణకు నవంబర్ 29 చివరి తేదీ కాగా.. డిసెంబర్ 3 నామినేషన్ల ఉపసంహరణకు గడువు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఫలితాలను వెల్లడించి, ఉప సర్పంచి ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది.

నామినేషన్‌కు అర్హతలు & రుసుములు..
- అభ్యర్థి తప్పనిసరిగా 21 సంవత్సరాలు దాటివుండాలి
- అదే గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి.
- లాభాపేక్షలేని ప్రభుత్వ లేదా నామినేటెడ్ పోస్టుల్లో ఉండకూడదు
నామినేషన్‌కు రుసుములు..
SC/ST/BC వారైతే castecertificateజత పరచాలి. అలాగే డిపాజిట్ డబ్బులను ముందుగానే కట్టేయాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: