మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌కు తెలంగాణ (TG) హైకోర్టులో ఊరట లభించలేదు.అతనిపై హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో జరుగుతున్న దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ అరెస్ట్ చేస్తే తక్షణం బెయిల్ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా హైకోర్టు అంగీకరించలేదు. మాదక ద్రవ్యాల కేసును కొట్టివేయాలని కోరుతూ అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
Read Also: TET: టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: