हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

TG: రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత

Saritha
TG: రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత

హైదరాబాద్(ఉప్పల్) : (TG) రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో రూ.62 కోట్ల వ్యయంతో చేబడుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబుతోపాటు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పలువురు కార్పొరేటర్లు, స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు.

Read also: TG: పంచాయతీరాజ్ చట్టంపై నూతన సర్పంచ్లకు శిక్షణ

TG: రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత
Priority given to urban development in the state

ఐటి శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు

అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో రూ.116 కోట్ల పలు పనులు చేపడుతున్నామని, (TG) గత రెండేళ్ల కాలంలో గ్రేటర్ పరిధిలో సిఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ మంత్రిగా ఉంటూ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల తోపాటు మంచినీరు, డ్రైనేజీ, క్రీడా వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉప్పల్లో యువతకు క్రీడా సదుపాయలు కల్పించాలనే లక్ష్యంతో రూ.9 కోట్లతో పుట్బాల్ స్టేడియం నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్ఎన్ఎపి కింద రూ. 35 కోట్లతో చెరువు సుందరీకరణ, హెచ్ఎండిఏ కింద రూ.3 కోట్లతో ఆరో వాటర్ ప్లాంటు, రూ. 2 కోట్లతో పాఠశాల భవనం నిర్మిస్తున్నామని తెలిపారు, కాప్రాలో రూ.55 కోట్లతో పలు పనులు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాలపై విమర్శలు, కాంగ్రెస్ పనితీరుపై ప్రశంసలు

గత ప్రభుత్వాలు ప్రజలను ప్రలోభాలు పెట్టిందని, గ్రేటర్లో గత ప్రభుత్వం పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూడాలని కోరాడు. ఉప్పల్లో గతంలో బిఆర్ఎస్ రూ.195 కోట్లు ఖర్చు చేసిందని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో రూ.380 కోట్లతో అభివృద్ది పనులు వేపట్టినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణలోని అన్ని మున్సి పాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చామని తెలిపారు. బతుకమ్మ కుంట తరహాలోనే ఉప్పల్ నల్ల చెరువును అభివృద్ధి చేస్తు న్నామని తెలిపారు. హైడ్రా అంటే బిజెపి, బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు, చెరువులు, మౌళిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాబోయే మూడేళ్లలలో మిగిలిన కార్పొరేషన్లను కూడా అభివృద్ది చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల తోపులాట

మంత్రి కాలికి గాయం శ్రీధర్ బాబు ఉప్పల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మరోసారి నినాదాలు, తోపులాట చోటు చేసుకుంది. ఉప్పల్ ఎసిపి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసినా పలువురు నేతలు పోటీపడి నేతల దృష్టిలో పడేందుకు తంటాలు పడ్డారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ చేతల అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పలుమార్లు మంత్రి శ్రీధర్ బాబు వారించారు. ఉప్పల్ పిర్యాదు చేసుకున్నారు. ఆర్తో ప్లాంటు ప్రారంభం సమయంలో మంత్రి శ్రీధర్ బాబు కాలు కొందరు తొక్కడంతో ఆయనకు స్వల్బంగా గాయాలు అయ్యాయి. ఉప్పల్ భగాయత్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు తోపులాట సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పంపించి వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870