తెలంగాణ (TG) రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమయింది. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించబోతున్నారు. కాసేపటి క్రితం ఫాంహౌస్ కు సిట్ అధికారులు బయలుదేరారు. సిట్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ లు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
Read Also: Medaram: భక్తులకు గుడ్ న్యూస్.. అక్కడి నుంచి అందరికీ ఉచిత బస్సులు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: