తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు (Airport) మరియు రోప్‌వేలు ఏర్పాటు కోసం ప్రణాళికలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. వరంగల్, ఆదిలాబాద్, రామగుండం వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు, యాదగిరిగుట్ట, హనుమాన్ కొండ, నాగార్జునసాగర్, మంథని రామగిరి కోటలకు రోప్‌వేలు ఏర్పాటుకు చర్యలు చేపట్టబడ్డాయి. వచ్చే ఏడాది నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భారీ నిధులను కేటాయిస్తోంది. రహదారులు-భవనాల శాఖ గత రెండు సంవత్సరాల్లో 6,617 కోట్ల విలువైన 239 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది, వీటిలో 1,659 కి.మీ. రహదారులు మరియు 62 వంతెనలు ఉన్నాయి.
Read also: ibomma-case: iBOMMA కేసులో మరో పెద్ద ట్విస్ట్

New airports in Telangana
తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాల మేరకు
వైపులా, ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాల మేరకు రాష్ట్రంలో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, ఆరు వరుసల రహదారి నిర్మాణం, హ్యామ్ పద్ధతిలో రోడ్ల అభివృద్ధి, మరియు ముఖ్యమైన రహదారుల ప్రమాద నివారణ పనులు చేపట్టబడ్డాయి. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు ద్వారా పెట్టుబడులు సమకూరి, అభివృద్ధికి వేగం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: