ఆమనగల్లులో రసవత్తరంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
TG Municipal elections: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎన్నిక ఆసక్తిగా మారింది. BRS పార్టీ తో గెలిచిన అభ్యర్థి చివరి అంకంలో కాంగ్రెస్లో చేరి జాక్పాట్ గా చైర్మన్ పదవి దక్కించుకున్నాడు. ఫిబ్రవరి 11న జరిగిన ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో బిఆర్ఎస్ (BRS) పార్టీ అభ్యర్థిగా నేనావత్ పత్యనాయక్ నాయక్ విజయం సాధించారు. బిఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ ఎనిమిది స్థానాలను గెలుచుకొని చైర్మన్ పదవికి పాపిశెట్టి రాము పేరును గులాబీ పార్టీ ప్రతిపాదించింది.
తర్వాత జరిగిన రాజకీయ సమీకరణలు బిజెపి, అధికార కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టి బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పత్య నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకుని మధ్యాహ్నం జరిగిన చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి గెలుపొందారు. దీంతో ఉదయం కారులో ఉన్న పత్య నాయక్ కాంగ్రెస్ కు సెకండ్ ఇచ్చి చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో అందరూ అతన్ని అదృష్ట జాతకుడిగా అభివర్ణిస్తున్నారు.
Read Also: TG Municipal elections: మహబూబ్నగర్ మేయర్ గా జి మమత ఎన్నిక..

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: