తెలంగాణ (TG) ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పటిష్టంగా అమలు చేస్తూ పూర్తిగా ప్రజలకే అంకితమైన, జవాబుదారీగా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద హామీ అని భట్టి కీలక సూచన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే వారికి అంత వేగంగా బిల్లులు మంజూరవుతాయని ఆయన భరోసా ఇచ్చారు.
Read Also: Kashmir: ప్రతి కాశ్మిర్ ముస్లింను ఉగ్రవాదిగా చూడొద్దు: ఒమర్ అబ్దుల్లా

లబ్ధిదారుల ఖాతాల్లో జమా
నిర్మాణం పురోగతి ఆధారంగానే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని.. కాబట్టి వేగంగా నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సొమ్ము దోపిడీకి గురికాకుండా..ప్రతి పైసా వారి అవసరాల కోసమే ఖర్చు చేస్తున్నామని.. పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్
డిమాండ్ ఎంత పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసే పటిష్ట వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని భట్టి గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంట్, పౌరులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నది కూడా ప్రభుత్వమేనని అన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని భట్టి పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: