సిట్ విచారణ అనంతరం, తెలంగాణ(TG) మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ హీరోయిన్ల ఫోన్‌లు ట్యాప్ చేయలేదని, బెదిరించలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు తమపై, తమ నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి ఎవరు బాధ్యులంటూ ఆయన ప్రశ్నించారు.సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆయన విమర్శించారు.
Read Also: Phone Tapping Case : ముగిసిన కేటీఆర్ విచారణ

విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలే అడిగారు
ఇది లీకుల ప్రభుత్వమని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మరొకరితో కలిసి తనను విచారించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేటీఆర్ అన్నారు. సిట్ కార్యాలయంలో తాను, పోలీసులు తప్ప మరెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. తనను సాక్షిగా పిలిచారా లేక మరో విధంగా పిలిచారా అనే విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. విచారణలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలనే పదేపదే అడిగారని, అసలు విషయమే లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: