తెలంగాణ (Telangana) ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Results) ఇటీవలే ముగియగా, ఇప్పుడు విద్యార్థులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో పాస్ కావడం కోసం ప్రయత్నిస్తే, మరికొందరు మార్కులను మెరుగుపరుచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాశారు.

పరీక్షకు హాజరైన విద్యార్థులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి మే 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించారు.
మూల్యాంకన ప్రక్రియ పూర్తి
ఇప్పటికే ఈ పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ కూడా ముగిసింది. ఇక ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల ఫలితాలకు సంబంధించి ప్రకటన జారీ చేసింది. మే 29 నుంచి మొదటి విడత మూల్యాంకనం, మే 31 నుంచి రెండో విడత మూల్యాంకనం చేపట్టారు.
ఫలితాల విడుదల తేదీ
ఇంటర్ బోర్డు పరీక్షల ఫలితాలకు సంబంధించి ప్రకటన జారీ చేసింది. ఇంటర్ బోర్డు తాజా ప్రకటన మేరకు జూన్ 16న సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం (జూన్ 16) మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెల్లడైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షల్లో కీలకమైన ఇంటర్ మార్కులు
ఈ సారి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే జోసా కౌన్సెలింగ్, ఈఏపీసెట్, నీట్ వంటి వివిధ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
Read also: TG CPGET Notification: సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల