हिन्दी | Epaper

TG Group-1: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: CM రేవంత్

Anusha
TG Group-1: హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: CM రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 (TG Group-1) ఉద్యోగ నియామకాల అంశం కీలక మలుపు తిరిగింది. ఈ నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు..ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రూప్-1 నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు మొదటి నుంచి అనేక కుట్రలు పన్నాయని విమర్శించారు. కానీ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా.. చివరకు న్యాయ పోరాటంలో నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వం విజయం సాధించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Agreement : ఈ ఒప్పందం ఉభయ తారకమేనా?

భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు కావాలి

ప్రభుత్వ చిత్తశుద్ధిని హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ఇక గ్రూప్-1కు ఎంపికైన 563 మంది అభ్యర్థులకు సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భర్తీ అవుతున్న తొలి గ్రూప్-1 (TG Group-1)అధికారులు మీరే అంటూ సీఎం అభ్యర్థులను ఉద్దేశించి కామెంట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870