TG : సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వెల్లడించారు. సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి ఉద్యోగుల మారు పేరుకు సంబంధించి త్వరితగతిన పరిష్కారం చేస్తామన్నారు. అలాగే మెడికల్ ఇన్వాల్యుయేషన్ సంబంధించి వాళ్లకున్న వ్యాధులకు సంబంధించి అన్ని విధాల పరిష్కారం చూపిస్తామని చెప్పారు.
Read Also: Phone Tapping Case : సంతోష్ రావు సిట్ విచారణ పూర్తి

కార్మికుల కోసం కొత్త కమిటీ
కోల్ ఇండియ నిబంధనల మేరకు సింగరేణి అధికారులకు కల్పిస్తున్న సౌకర్యాలను కార్మికులకు కూడా వర్తింప చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఐఫోర్ కమిటీ నిర్ణయించి, వారి కల సాకారం చేస్తామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సింగరేణి ఉద్యోగులందరికీ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా ఒక నమూనాగా గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కోసం రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
తమ ప్రభుత్వం సింగరేణిలో 2,539 పోస్టులను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. వీటిలో 798 ఎక్స్ టర్నల్ పోస్టులు ఉండగా, 1,741 కారుణ్య నియామకాలు ఉన్నాయని వివరించారు. వీటితో పాటు, క్యాథ్ ల్యాబ్ల ఏర్పాటు ద్వారా సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇక 2024-25లో సింగరేణి చరిత్రలో అత్యధికంగా రూ.6,394 కోట్లు సాధించగా, అత్యధికంగా 34 శాతం లాభాల వాటా కింద రూ.802 కోట్లను కార్మికులకు చెల్లించామన్నారు. వీరితో పాటు, పొరుగు సేవల సిబ్బందికి కూడా రూ.5,500 చొప్పున లాభాల్లో వాటా చెల్లించినట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: