అమరావతి మీదుగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే:
హైదరాబాద్ : తెలంగాణలో నూతనంగా నిర్మించబోయే భారత్ ఫోర్త్ సిటీ(TG Forth city)నుంచి అమరావతి మీదుగా నిర్మించబోయే రహదారి తెలుగు వరంగా మారబోతున్నది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా జిల్లాలో మీదుగా అమరావతి టచ్ చేస్తూ మచిలీపట్నం వరకు నిర్మించే ఆధునిక రోడ్డు 53 కి.మీ దూరాభారం తగ్గిస్తూనే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేగవంతమైన ప్రయాణానికి వీలవుతుంది. ఇరుప్రాంత ప్రజలు రెండున్నద గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే వెనులుబాటు ఉంటుంది. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి, వరసల పెంపుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నాం.
వాటికి కొనసాగింపుగా ఇప్పుడో మరో మెగా అనుసంధాన ప్రాజెకు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే రాబోతున్నది. తొలుత అమరావతి వరకు మాత్రమే అనుకున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)నేరుగా పోర్టులవరకు రోడ్డు ఉండాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దాని పొడవును పెంచడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. కేంద్రం కూడా దీని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకు డిపిఆర్ సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తం పొడవు 297 కిలో మీటర్లు ఉండే ఈ రహదారి రెండు రాష్ట్రాలలో ఉమ్మడి నాలుగు జిల్లాలు, 100 గ్రామాల మీదుగా పోతుంది. తెలంగాణ పరిధిలో ఉమ్మడి రంగారెడ్డి నల్లగొండ జిల్లాల్లోని 40 గ్రామాలు, ఆంధ్రప్రదేశ్ లో గుంటురు కృష్ణ జిల్లా పరిధిలో జిల్లాల్లోని 60 గ్రామాలు ఈ రోడ్డు నుఆనుకొని ఉంటాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మీరాఖాన్ పేట, తాడిపర్తి, సింగారం, నందివనపర్తి, నక్కెర, మేడిపల్లి, యాచారం, మల్కీజ్ గూడ, మంది గౌరెల్లి, తక్కెళ్లపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్, మంతన్ గౌరెల్లి గ్రామాల మీదుగా ఈ రహదారి ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ్మాడపల్లి, అజిలాపూర్, ఏరుగండపల్లి, కొండూరు, మర్రిగూడ, రామడిపల్లి, వట్టిపల్లి, లింగోటం, భీమనపల్లి. దామెర, చిట్టెంపహాడ్, నాంపల్లి, మొహమ్మదా పురం, ఊట్లపల్లి, తేనెపల్లె, గుర్రంపోడ్, చేపూర్, మోసంగి, తెప్పలమడుగు, హాలియా, మాచర్ల, కొంపల్లి, బోయగూడెం రాజవరం అడవి దేవులపల్లి వెళ్ళేలా 118 కి.మి నిడివితో డిపిఆర్ రూపొందిస్తున్నారు.
Read also: టీవీకే పార్టీ అధినేత ఇంటికి బాంబు బెదిరింపు

హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే:
ఆంధ్రప్రదేశ్ లో 179కి.మి నిడివి కలిగిన రోడ్డు గుంటూరు జిల్లాలో కళేపల్లి, దైద, వజీరాబాద్, పులిపాడు, దాచేపల్లి ముత్యాలంపాడు, పిన్నెల్లి, వేమవరం, మాచవరం, తురక పాలెం, మోర్గంపాడు, పిలుట, శ్రీ రుక్మిణీ పురం, పాలెం, చంద్రాజుపాలెం, కందిపాడు. అమరావతి, పెరికపాడు దొడ్లేరు, హుస్సేన్ బండ తేరు అనంతారం, గుడిపాడు. తళ్లూరు, పెసపాడు, రెంటపల్లి, పండి తాపురం అమరావతి, పాటిబండ్ల వేమారం, సిరిపురం, మండెపూడి, పాములపాడు, పొన్నెకలు, నిండు ముక్కల, తాటికొండ లామ్, గోరంట్ల గుంటూరు కంతేరు కాజా నంబూరు చిలుపూరు పెర్కలపుడీ దుగ్గిరాల వల్లభపురం మున్నంగీ వల్లూరు. కృష్ణాజిల్లాలో భద్రిరాజుపాలెం, కుమ్మమూరు, కపిళేశ్వరం, లంకపల్లి చల్లపల్లి నిమ్మకూరు, నిడుమూరు, గూడూరు, పెడన, మచిలీపట్నం చేరుతుంది. కోసూరు తెనాలి మధ్య కృష్ణానదిని దాటి మచిలిపట్నం రేవుకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయా శాఖలకు కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఇరురాష్ట్రాలకు లబ్ది చేకూర్చే అంశాలపై తెలంగాణ, ఎపి ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటంది. అందులో భాగంగానే హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్సప్రెస్ హైవే నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య 65వ సంబరు జాతీయ రహదారి ఉంది. ఐతే, గ్రీన్ఫీల్డ్ ఎక్సప్రెస్ హై హైవే హైదరాబాద్ నుంచి కాకుండా ఫోర్త్ సిటీ నుంచి ఉంటే బాగుంటుంద ని తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తెలిపిన తెలిపినట్లు సమాచారం. అమరావతిఫోర్త్ సిటీని కలుపుతూ గ్రీన్ఫీల్డ్ ఎక్సెప్రెస్ హైవే వస్తే విజయవాడ హైదరాబాద్ ప్రస్తుత జా జాతీయ రహదారికి అది సమాంతర రోడ్డు అవుతుంది. ఇప్పుడున్న జాతీయ రహదారికి అటుఇటుగా 10 కి.మీ. దూరంలో దీన్ని నిర్మిస్తే ప్రత్యేక బెల్ట్ తయారు అవుతుంది.
పారిశ్రమికంగా అభివృద్ధి:
అలాగే ఈ మధ్యలో పారిశ్రమికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం కూడా సరేనన్న నేపథ్యంలో హైదరాబాద్మరావతి మచిలీపట్నం గ్రీన్ఫోల్డ్ ఎక్స్ప్రెప్రెస్(TG Forth city) హైవే కోసం డీపీఆర్ కు త్వరలోనే టెండర్లు పిలువడానికి జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ సిద్ధమవుతోంది. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులోని ఏదో ఒక ఎగ్జిట్ నెంబర్ వద్ద నుంచి గ్రీన్ఫోల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 12 వరసల రహదారి నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఐతే, ఈ హైవేకు సర్వీస్ రోడ్లు ఉండవని అధికారులు తెలిపారు. ప్రధాన పట్టణాలకు సమీపం లోనే అతి తక్కువగా ఎగ్జిట్ రోడ్లు ఏర్పాటు చేయాలని అంచనాకు వచ్చారు. తద్వారా వేగంగా వెళ్లే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని భావిస్తున్నారు. హైవే నిర్మాణంలో తగు జాగ్రత్తలతో పాటు భద్రత ప్రమాణాలు, నాణ్యత, పశువులు రాకుండా ఉండేలా కంచె వంటివి ఏర్పాటు చేయాలని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఇది పూర్తి యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా రూపుదిద్దుకోనుంది. పోర్టుల ర్ధుల ద్వారానే విదేశాలకు సరకు రవాణా జరుగుతుంది. ລ, తెలంగాణకుసముద్రతీరం లేకపోవడంతో పోర్టులు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. దీంతో సముద్ర మార్గం ద్వారా ఎగుమతులు, దిగుమతులు చేయడానికి ఏపీపై ఎక్కువ ఆధారపడుతోంది. హైదరాబాద్” అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే ఎగుమతులు, దిగుమతులకు వ్యయప్రయాసలు తగ్గనున్నాయి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రాజధాని నగర శివారులో ఆమ ఆమనగల్లు ముచ్చర్లలో డ్రైపోర్టు నిర్మించాలనీ భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: