తెలంగాణ ఈఏపీ సెట్-2026 (TG EAPCET 2026) (గతంలో ఎంసెట్) షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదేనెల 19 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 4,5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
Read Also: TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

JNTU-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే TG EAPCET 2026 పరీక్ష
ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం అవుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు కొనసాగుతాయి.షెడ్యూల్ ప్రకారం ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 4, 5 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి. కాగా ఈ ఏడాదికి కూడా JNTU-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే (TG EAPCET 2026) పరీక్ష నిర్వహించనున్నారు. మిగిలిన CETలను వేర్వేరు యూనివర్సిటీలను కేటాయిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: