हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!

Sushmitha
Telugu News: TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!

హైదరాబాద్: మొంథా తుపాను(Montha tupanu) బీభత్సం తెలంగాణ రైతాంగాన్ని అల్లకల్లోలం చేసింది. ఎడతెరిపి లేని వర్షాల(rains) కారణంగా చేతికొచ్చిన పంట(crop) నీటిపాలవ్వడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.48 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Read Also: Kurnool Bus Tragedy: రెండో డ్రైవర్ నిద్ర మత్తు..నిర్లక్ష్యం

 TG

పంట నష్టం వివరాలు, ప్రభావిత జిల్లాలు

తుపాను కారణంగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల్లో నష్టం సంభవించింది.

  • పంట నష్టం: వరి 2.82 లక్షల ఎకరాల్లోను, పత్తి 1.52 లక్షల ఎకరాల్లోను దెబ్బతిన్నాయి.
  • ప్రభావిత జిల్లాలు: నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పత్తి నష్టం అధికంగా ఉంది. మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కూడా పత్తి దెబ్బతింది.
  • మహబూబాబాద్‌లో: వరి 50 శాతం మేర, మొక్కజొన్న 70 శాతం మేర దెబ్బతిన్నట్లు లెక్కకడుతున్నారు.
  • వరంగల్, ఖమ్మం: ఇక్కడ పత్తి, వరి, మిరప పంటలు దెబ్బతినడంతో రైతులు పెట్టుబడులు కూడా తిరిగి రావేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం, ఇతర ఉత్పత్తుల నష్టం

పత్తి దూది పింజ వర్షానికి తడిసి నల్లబడుతుండగా, వరి పైరు నేలకొరిగింది. వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో కురిసిన వర్షాలతో కంకులు మొలకెత్తే ప్రమాదం ఏర్పడింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం, మొక్కజొన్న కూడా పూర్తిగా తడిసిపోయాయి. కూరగాయల తోటలు సైతం దెబ్బతినడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కౌలు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఈ నష్టం కారణంగా చేసిన అప్పులు తీరే మార్గం కనిపించడం లేదని, తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870