తెలంగాణ (TG Crime) లోని, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని మృగవని పార్కు వద్ద హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్కూలుకు చెందిన బస్సు బోల్తా పడింది..ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బండ్లగూడ జాగీర్ లోని హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్లెన్స్ స్కూలుకు చెందిన టీజీ 07వీ 2935 గల బస్సు హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వెళ్తున్న సమయంలో మృగావని పార్కు వద్ద చేరుకోగా.. ముందున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు ప్రమాదానికి గురైంది.
Read Also: Cyber crime: నకిలీ AI వీడియోలతో అమాయకులను మోసం చేస్తున్న కేటుగాళ్లు

భారీగా ట్రాఫిక్ జామ్
ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం కారణంగా పలువురు విద్యార్థులు గాయపడడంతో వారిని స్థానిక ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: