తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో (TG Crime) చోటుచేసుకున్న ప్రేమజంట ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అచ్చంపేట మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.. గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్, పదర గ్రామానికి చెందిన సువర్ణ ప్రేమలో ఉండగా, వారి వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మనస్థాపానికి గురైన యువతీ యువకులు ఇంట్లోనే ఒకే చీరతో ఉరి వేసుకొని మృతి చెందారు.బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Baramati aircraft crash: పొగమంచు కారణంగానే విమానం క్రాష్?

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: