హైదరాబాద్: తెలంగాణ(TG) రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు పూనుకుంది. ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి ఏఐసీసీ (AICC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: Crime: కూలీలతో వెళ్తున్న బస్సుకు మంటలు.. ఇద్దరు దగ్ధం

శుక్రవారం ప్రమాణ స్వీకారం
రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీ వర్గానికి చోటు లభించింది. మంత్రిగా అజారుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల(Jubilee Hills by-election) నేపథ్యంలో మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. ఇప్పటికే పరోక్షంగా ఎంఐఎం (MIM) మద్దతు కూడగట్టిన కాంగ్రెస్, తాజాగా మంత్రివర్గంలో మైనారిటీకి చోటు కల్పించడం ద్వారా తమ ప్రాధాన్యతను తెలియజేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: