రాజకీయాల్లో పేరు మాత్రమే కాదు, ఇంటిపేరు కూడా కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యంగా మహిళా నాయకుల విషయంలో పుట్టింటి ఇంటిపేరే రాజకీయంగా గుర్తింపునిస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దేశ రాజకీయాల్లో ఇప్పటికే పలువురు ప్రముఖ మహిళా నాయకులు తమ పుట్టింటి పేర్లతోనే ప్రజల్లో నిలిచారు. ఇందుకు ఉదాహరణగా సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా, వై.ఎస్. షర్మిలా లాంటి నాయకుల పేర్లు తరచుగా వినిపిస్తుంటాయి.
Read also: TG: భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. హైకోర్టు సంచలన తీర్పు

An interesting discussion on Kavitha’s surname change
పెళ్లి తర్వాత భర్త ఇంటిపేరు వచ్చినప్పటికీ, రాజకీయంగా లాభిస్తుందనే కారణంతో పుట్టింటి పేరునే కొనసాగించడం ఇప్పుడు సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా ఇదే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆమె తండ్రి ఇంటిపేరుతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో ఆమె భర్త ఇంటిపేరుతో రాజకీయాల్లోకి వస్తారా? లేక ఇప్పటి విధంగానే కొనసాగుతారా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: