తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సంక్రాంతి (sankranti) పండగ వరకు మాత్రమే కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యానికి చేరువగా ధాన్యం సేకరణ పూర్తవడంతో, పండగ అనంతరం కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో రైతులు ఆలస్యం చేయకుండా తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.
Read also: Hyderabad: ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Deadline for monsoon season paddy procurement
రైతులు సంక్రాంతి లోపు తమ ధాన్యాన్ని విక్రయించుకోవడం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం మొత్తం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 69 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తైంది. ఇది దాదాపు 95 శాతం కంటే ఎక్కువ. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న నిల్వలు, ఇంకా రానున్న ధాన్యం కలిపి మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే గత పదేళ్లలో ఇదే అత్యధిక ధాన్యం సేకరణగా నిలవనుంది.
ఇప్పటివరకు 13.70 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.16,942 కోట్లను జమ చేశారు. ఇందులో దొడ్డు ధాన్యం, సన్న ధాన్యం రెండూ ఉన్నాయి. సన్న ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ కూడా చెల్లిస్తుండగా, మిగిలిన బోనస్ మొత్తాన్ని కొనుగోళ్లు పూర్తయ్యేలోపు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల రైతులు సంక్రాంతి లోపు తమ ధాన్యాన్ని విక్రయించుకోవడం ఎంతో కీలకంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: