చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా దాని అమ్మకాలు, వినియోగం ఆగడం లేదు.ఏకంగా (TG) హైకోర్టు చెప్పినా ఆగని చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయి.. చైనా మాంజా అమ్మకాలను హైకోర్టు నిషేధించినా నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాగా, చైనా మాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
Read also: Telangana: నేషనల్ ఖో ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ..
మరో ఘటన
పక్షులు, విద్యుత్ తీగలు, ప్రజా ఆస్తులకు కూడా భారీ నష్టం జరుగుతుందని పోలీసులు తనిఖీలు పెంచి మాంజా విక్రయాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చైనా మాంజా చుట్టుకుని మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా చుట్టుకోవడంతో చైతన్య చేయి తెగింది.

తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు మాదాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి మెడకు మాంజా తగిలి లోతైన గాయమైన విషయం తెలిసిందే. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: