తెలంగాణలో(TG) శనివారం ఒక్కరోజే 40 వేల మందికిపైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సెలవు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం, డిసెంబర్ 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే ప్రభుత్వ సెలవులు కాగా, 28న ఆదివారం రావడంతో మధ్యలోని 27న చాలామంది ఉపాధ్యాయులు సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: CP Sajjanar: మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదు

సంవత్సరం ముగింపు దశలో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న క్యాజువల్ లీవ్‌లను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఉపాధ్యాయులు సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.12 లక్షల మంది ప్రభుత్వ టీచర్లు ఉండగా, శనివారం దాదాపు 33 శాతం మంది విధులకు హాజరు కాలేదు.
పాఠశాలల్లో బోధనకు అంతరాయం
ఉపాధ్యాయుల(TG) భారీ గైర్హాజరీ కారణంగా అనేక ప్రాంతాల్లో పాఠశాలల్లో తరగతులు సక్రమంగా జరగకపోయినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పాఠాలు పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: