పీఎం ఈ డ్రైవ్ పథకం కింద రాష్ట్రం (TG) లో ప్రస్తుతం 575 ఆర్టీసీ ఈవీ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. త్వరలోనే మరో 2800 ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.
Read also: DGP Shivadhar Reddy: మావోల రహిత రాష్ట్రంగా తెలంగాణ

వరంగల్ మున్సిపాలిటీకి 100, నిజామాబాద్ మున్సిపాలిటీకి 50 బస్సులు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా వస్తున్నాయని చెప్పారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఈవీ పాలసీని తీసుకువచ్చామని, ఈ ఏడాది కాలంలో లక్ష ఈవీ వాహనాలు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: