Telangana: నగరంలో పారిశ్రామిక వాడలు కాలుష్యపు జాడలుగా మారాయి. నగరవాసిని కాలుష్యభూతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకూ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్యకారక పరిశ్రమలను శివారులోకి తరలించాలనే ప్రతిపాదన మరోసారి తెర మీదికి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు ఈ పరిశ్రమలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమల తరలింపు ప్రక్రియను వేగిరం చేయాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యంత్రాంగాన్ని ఆదేశించారు. పరిశ్రమలను శివా రులోకి తరలించాలని 2012లో అప్పటి కిరణ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కేసీఆర్ సర్కారు కూడా ఈ అంశంపై కసరత్తు చేసింది. అయితే, ఈ వ్యవహారం ఆశించిన మేరకు ఫలితాలనివ్వలేదు.
Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్

పరిశ్రమల తరలింపు ప్రయత్నాలు
పారిశ్రామిక వేత్తల లాబీయింగ్ పరిశ్రమల తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. కాలుష్య ఉద్గారాలను వెదజల్లుతున్న పరిశ్రమలు జనావాసాల్లో కొనసాగడం శ్రేయస్కరం కాదని, మొదట్లో పారిశ్రామికవాడలు శివార్లలో ఉన్నప్పటికీ నగరీకరణ నేపథ్యంలో అక్కడ కూడా కాలనీలు వెలిసినందున వీటి తర లింపు అనివార్యమని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రసాయనిక కంపెనీలను సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్ ఇతర జిల్లాల్లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో భూములను సేకరించి, పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేశారు. ప్లాట్లను పరిశ్రమలకు కేటాయించారు. భూములను తీసుకున్న పరిశ్రమలు తమ కార్యకలాపాలను
మాత్రం నగరం నుంచే కొనసాగిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) లోపల వేల సంఖ్యలో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఉన్నాయి.
నగరలో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు
జీడిమెట్ల, కాటేదాన్, బొల్లారం, భోలకప్పూర్, చర్లపల్లి, లింగంపల్లి తదితర పారిశ్రామిక వాడల్లో బీహెచ్ ఈఎల్, ఐడీపీఎల్, హెచ్ఎంటీ, తోళ్ల పరిశ్రమ, ఐరన్, స్టీల్ వంటి భారీ పరిశ్రమలతో పాటు పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఏర్పాట య్యాయి. వాటికి అనుసంధానంగా మరికొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్యోగులు, కార్మికులు, ఉపాధి కోసం వివిధ వర్గాలకు చెందినవారు నివా సం ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కాలుష్య ప్రభావంతో జనాలు రోగాల బారిన పడుతున్నారు. వ్యర్థ జలాల నిర్వ హణ అధ్వానంగా ఉంది. సాధారణ మురుగు కాలువల్లో ప్రమాదకరమైన రసాయన వ్యర్థ జలాలను విడిచిపెడుతుండటం స్థానికులకు సంకటం గా మారింది. స్థానికుల నుంచి ఫిర్యాదు వస్తేనే పీసీబీ అధికారులు చర్యలకు ఆదేశిస్తున్నారు. కోన్ని సందర్భాల్లో మూసివేయాలని చెప్పినా, అనదికారికంగా కార్యకలాపాలను నడిపిస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు 3,800 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉండగా అందులో సుమారు 2 వేలకు పైగా పరిశ్రమలు నగరంలోనే ఉన్నట్లు అంచనా. ఆరెంజ్ కేటగిరీలోని 4 వేలకుపైగా పరిశ్రమల్లో సుమారు 2,500 వరకు నగర పరిధిలోనే ఉండొ చ్చని అంచనా. వీటిల్లో ఇప్పటి వరకు సుమారు గా 40 శాతం కంపెనీలు ఇతర ప్రాంతాలకు తర లించినట్లు అధికారులు చెబుతున్నారు. భోలక్ పూర్ని తోలు పరిశ్రమను మేడ్చల్ జిల్లాకు, ఇను ము, స్టీల్ పరిశ్రమలను వికారాబాద్ జిల్లా రాకం చర్లకు, నూనె తయారీ పరిశ్రమలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో టీజీఐఐసీ మౌలిక వసతులను అభివృద్ధి చేసి, పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ఆసక్తి ఉన్న పరిశ్రమలకు ఆయా ప్రాంతాల్లో స్థలాలను కేటాయించారు. కొంత కాలం వేచి చూసి మీరు వెళ్లకపోతే ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించినా యాజమాన్యాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: